స్టాక్‌మార్కెట్‌కు వైరస్, యస్‌ బ్యాంక్‌ షాక్‌.. | Indices End At Six Month Lows | Sakshi
Sakshi News home page

స్టాక్‌మార్కెట్‌కు వైరస్, యస్‌ బ్యాంక్‌ షాక్‌..

Mar 6 2020 7:29 PM | Updated on Mar 6 2020 7:29 PM

Indices End At Six Month Lows - Sakshi

కరోనా, యస్‌ బ్యాంక్‌ పరిణామాలతో కుప్పకూలిన స్టాక్‌మార్కెట్‌ 

ముంబై : స్టాక్‌మార్కెట్లను వరుస నష్టాలు వీడటం లేదు. కరోనా వైరస్‌ భయాలకు తోడు యస్‌ బ్యాంక్‌ సంక్షోభంతో శుక్రవారం మార్కెట్లు కుప్పకూలాయి. ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో యస్‌ బ్యాంక్‌ షేర్‌ ఏకంగా 85 శాతం నష్టపోయింది. బ్యాంక్‌ను కాపాడేందుకు చర్యలు చేపడతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భరోసా ఇవ్వడంతో యస్‌ బ్యాంక్‌ షేర్‌ కొద్దిగా కోలుకున్నా 56 శాతం నష్టంతో ముగిసింది. ఇతర బ్యాంకింగ్‌ రంగ షేర్లూ నష్టపోయాయి. అమ్మకాల ఒత్తిడితో అన్ని రంగాల షేర్లూ నష్టాలు మూటగట్టుకున్నాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 894 పాయింట్ల నష్టంతో 37,577 పాయింట్ల వద్ద ముగియగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 279 పాయింట్ల నష్టంతో 10,988 పాయింట్ల వద్ద క్లోజయింది.

చదవండి : ‘యస్‌ బ్యాంక్‌ను నిలబెడతాం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement