ఫ్లిప్‌కార్ట్‌లో ఇక సినిమాలు కూడా.. | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్‌లో ఇక సినిమాలు కూడా..

Published Tue, Aug 6 2019 12:56 PM

Flipkart Focus on Video Streaming Services - Sakshi

న్యూఢిల్లీ: ప్రత్యర్థి ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ను దీటుగా ఎదుర్కొనే దిశగా వాల్‌మార్ట్‌ సారథ్యంలోని ఫ్లిప్‌కార్ట్‌ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. త్వరలోనే ప్రాంతీయ భాషల్లో వీడియో స్ట్రీమింగ్‌ సేవలు కూడా అందుబాటులోకి తేనున్నట్లు సోమవారం ప్రకటించింది. ’ఫ్లిప్‌కార్ట్‌ వీడియోస్‌’ పేరిట ఈ సర్వీసు ప్రారంభించనుంది. ప్రకటనల ఆదాయంతో నిర్వహించే ఈ సర్వీసు.. ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌ను ఉపయోగించే యూజర్లకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. షార్ట్‌ ఫిలిమ్‌లు, పూర్తి నిడివి సినిమాలు, సిరీస్‌లు మొదలైనవి ఫ్లిప్‌కార్ట్‌ వీడియోస్‌లో ఉంటాయి. పండుగ సీజన్‌ రానున్న నేపథ్యంలో ఈ పరిణామం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఈ సేవలపై భారీగా ఇన్వెస్ట్‌ చేస్తున్నాం. షాపింగ్‌ కోసమే కాకుండా మా ప్లాట్‌ఫాంపై యూజర్లు మరింత సమయం వెచ్చించేలా చేయాలని యత్నిస్తున్నాం‘ అని ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి చెప్పారు. ముందుగా హిందీతో ప్రారంభించి తర్వాత దశల్లో తమిళం, తెలుగు, బెంగాలీ భాషల్లో కూడా కంటెంట్‌ అందించనున్నట్లు వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement