ఎయిర్‌టెల్‌ రూ.7,200 కోట్ల గ్యారంటీ ఇవ్వాలి

DOT Asked Guarantee For Airtel And TATA Teleservices Merger - Sakshi

ఎయిర్‌టెల్‌లో టాటా టెలీ విలీనం  

బ్యాంక్‌ గ్యారంటీ అడిగిన డాట్‌  

న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌లో టాటా టెలీ సర్వీసెస్‌(టీటీఎస్‌ఎల్‌) విలీనానికి టెలికం డిపార్ట్‌మెంట్‌(డాట్‌) ఆమోదం తెలిపింది. అయితే భారతీ ఎయిర్‌టెల్‌ రూ.7,200 కోట్ల బ్యాంక్‌ గ్యారంటీని ఇవ్వాలని షరతు విధించామని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

వన్‌టైమ్‌ స్పెక్ట్రమ్‌ చార్జీల కింద రూ.6,000 కోట్లు, టాటా టెలీ సర్వీసెస్‌ నుంచి పొందినస్పెక్ట్రమ్‌ కోసం మరో రూ.1,200 కోట్ల బ్యాంక్‌ గ్యారంటీని ఇవ్వాలని ఆ అధికారి వివరించారు. దీంతో ఎయిర్‌టెల్‌లో టాటా టెలీసర్వీసెస్‌ విలీనం పూర్తవుతుందని పేర్కొన్నారు. ఈ విలీనానికి ఈ నెల 9న టెలికం మంత్రి మనోజ్‌ సిన్హా షరతులతో కూడిన ఆమోదాన్ని తెలిపారని ఆ అధికారి పేర్కొన్నారు. విలీనం జరగటానికి ముందే ఇరు కంపెనీలు కోర్టు కేసుల విషయమై అండర్‌టేకింగ్‌ను సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top