వొడాఫోన్‌–ఐడియా విలీన సంస్థకు చైర్మన్‌గా కేఎం బిర్లా  | chairman of the Vodafone-Idea merger company | Sakshi
Sakshi News home page

వొడాఫోన్‌–ఐడియా విలీన సంస్థకు చైర్మన్‌గా కేఎం బిర్లా 

Mar 23 2018 1:03 AM | Updated on Mar 23 2018 1:03 AM

 chairman of the Vodafone-Idea merger company - Sakshi

న్యూఢిల్లీ: త్వరలో విలీనం కాబోయే వొడాఫోన్‌–ఐడియా సంస్థకు నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కుమార్‌ మంగళం బిర్లా బాధ్యతలు చేపడతారు. ఈ మేరకు ఐడియా ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌ను దాఖలు చేసింది. దీనిప్రకారం, బైలేశ్‌ శర్మ కొత్త సంస్థ సీఈఓగా ఉంటారు.  శర్మ  ప్రస్తుతం వొడాఫోన్‌ ఇండియా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ రెండు సంస్థల విలీనంతో దేశంలో దాదాపు 23 బిలియన్‌ డాలర్ల విలువైన అతిపెద్ద టెలికం   సంస్థ ఆవిర్భావం జరగనుంది. దీని మార్కెట్‌ వాటా దాదాపు 35 శాతం ఉంటుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement