9 శాతంపైగా పెరిగిన సైయంట్ లాభం | 9 per cent increase in profit saiyant | Sakshi
Sakshi News home page

9 శాతంపైగా పెరిగిన సైయంట్ లాభం

Jul 17 2015 12:23 AM | Updated on Sep 3 2017 5:37 AM

9 శాతంపైగా పెరిగిన సైయంట్ లాభం

9 శాతంపైగా పెరిగిన సైయంట్ లాభం

ఇంజనీరింగ్ సర్వీసుల రంగంలో ఉన్న సైయంట్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.74.8 కోట్ల నికర లాభం ఆర్జించింది.

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఇంజనీరింగ్ సర్వీసుల రంగంలో ఉన్న సైయంట్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.74.8 కోట్ల నికర లాభం ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 9.2 శాతం అధికం. టర్నోవరు 16.8 శాతం వృద్ధి చెంది రూ.726 కోట్లకు చేరుకుంది. నిర్వహణ లాభం 4.7 శాతం అధికమై రూ.91.8 కోట్లుగా ఉంది. త్రైమాసికంలో కొత్తగా 26 కంపెనీలు క్లయింట్ల జాబితాకు తోడయ్యాయి. అంచనాలకు తగ్గట్టుగానే ఫలితాలు నమోదయ్యాయని కంపెనీ ఎండీ, సీఈవో కృష్ణ బోధనపు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కంపెనీ వ్యాపారంలో ఆసియా పసిఫిక్ దేశాలు ఉత్తమ పనితీరు కనబరిచాయి. గతేడాదితో పోలిస్తే ఈ దేశాల నుంచి వ్యాపారం 28 శాతం పెరిగింది.

Advertisement

పోల్

Advertisement