'బాబు సొంత మండలంలోనే పరిస్థితి ఇంత దారుణమా?' | Ysrcp leaders slams Chandrababu Naidu's government | Sakshi
Sakshi News home page

'బాబు సొంత మండలంలోనే పరిస్థితి ఇంత దారుణమా?'

Dec 6 2014 4:37 PM | Updated on Aug 13 2018 4:11 PM

పంటలు నష్టపోయి మూడేళ్లు అవుతున్నా ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోవడం దారుణమని వైఎస్ఆర్ సీపీ నేతలు మండిపడ్డారు.

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్లో రైతులు పంటలు నష్టపోయి మూడేళ్లు అవుతున్నా ప్రభుత్వం ఇప్పటివరకూ పరిహారం ఇవ్వకపోవడం దారుణమని వైఎస్ఆర్ సీపీ నేతలు మండిపడ్డారు. శనివారం చిత్తూరులో వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి,  ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విలేకరులతో మాట్లాడారు.

 

చంద్రబాబు సొంత మండలంలోనే రైతుల పరిస్థితి దారుణంగా ఉండటంపై చంద్రబాబు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఆయన సొంతమండలంలోని రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందంటూ ఏపీ ప్రభుత్వ వైఖరిని ఎద్దేశా చేశారు. రైతుల సమస్యను తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం కోసం ప్రభుత్వంతో పోరాడతామని వారు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement