ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా మొత్తం రుణాలు మాఫీ చేయాల్సిందేనని వైఎస్ఆర్ సీపీ నేతలు డిమాండ్ చేశారు.
ఏలూరు: ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా మొత్తం రుణాలు మాఫీ చేయాల్సిందేనని వైఎస్ఆర్ సీపీ డిమాండ్ చేసింది. శుక్రవారం వైఎస్ఆర్ సీపీ నేతలు ధర్మాన ప్రసాదరావు, కొత్తపల్లి సుబ్బారాయుడు, ఆళ్లనాని మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన టీడీపీ ఇప్పుడు రూ. 5 వేల కోట్ల రూపాయలకు కుదించడం సరికాదన్నారు.
ప్రజలు నమ్మి ఓట్లు వేసి అధికారమిస్తే చంద్రబాబు నాయుడు నమ్మకద్రోహం చేశారని విమర్శించారు. చంద్రబాబు రుణమాఫీ చేస్తారని ప్రజలంతా నమ్మారు. కానీ చంద్రబాబు నిజంగానే మారిపోయారన్నారు. ఎన్నికల హమీలు నెరవేర్చేవరకు పోరాటం కొనసాగిస్తామని వైఎస్ఆర్ సీపీ నేతలు పేర్కొన్నారు.