రాజన్న రాజ్యం రాబోతుంది: వైఎస్‌ షర్మిల | YSRCP Leader YS Sharmila Casting Her Vote In Pulivendula | Sakshi
Sakshi News home page

జగన్‌ వల్లనే హోదా సజీవం: వైఎస్‌ షర్మిల

Apr 11 2019 10:08 AM | Updated on Apr 11 2019 7:49 PM

YSRCP Leader YS Sharmila Casting Her Vote In Pulivendula - Sakshi

సాక్షి, వైఎస్సార్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వల్లే ప్రత్యేక హోదా ఉద్యమం సజీవంగా ఉందని, ప్రతి జిల్లాలనూ యువభేరి కార్యక్రమాలతో హోదా పట్ల యువతలో వైఎస్‌ జగన్‌ అవగాహన పెంచారని వైఎస్‌ జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల తెలిపారు. యువత పెద్ద ఎత్తున వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటోందని ఆమె అన్నారు. రాష్ట్రంలోని పరిస్థితి చూస్తే.. మళ్లీ రాజన్న రాజ్యం రాబోతుందని అనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. పులివెందులలో వైఎస్‌ షర్మిల ఓటు హక్కు వినియోగించుకున్న సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని షర్మిల అభిప్రాయపడ్డారు.

వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు పొన్నతోటలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఓటర్లను ప్రలోభాలకు పాల్పడుతూ.. ఓటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి. ఎన్నికలు నిష్పాక్షపాతంగా జరిగేలా చూడాలని ఎన్నికల అధికారులను కోరారు. ఓటర్లను బెదిరిస్తున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement