వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్‌గా గట్టు శ్రీకాంత్‌రెడ్డి | YSRCP district convenor srikanth reddy | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్‌గా గట్టు శ్రీకాంత్‌రెడ్డి

Dec 15 2013 4:18 AM | Updated on Aug 29 2018 4:16 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్‌గా డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

సాక్షిప్రతినిధి, నల్లగొండ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్‌గా డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
 
 పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు తెలియజేసిన వివరాల మేరకు, హుజూర్‌నగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ , సీఈసీ సభ్యుడిగా ఉన్న గట్టు శ్రీకాంత్‌రెడ్డి జిల్లా కన్వీనర్‌గా నియమితులయ్యారు. కాగా, పార్టీ కన్వీనర్‌గా ఇప్పటి దాకా వ్యవహరించిన బీరవోలు సోమిరెడ్డిని సీఈసీ సభ్యుడిగా తీసుకున్నారు. ఇటీవలే బీరవోలు సోమిరెడ్డిని సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా నియమించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement