‘అగ్రిగోల్డ్‌’పై చర్చకు వైఎస్సార్‌ సీపీ పట్టు | Ysrcp asked for debate on Agrigold issue | Sakshi
Sakshi News home page

‘అగ్రిగోల్డ్‌’పై చర్చకు వైఎస్సార్‌ సీపీ పట్టు

Mar 23 2017 3:04 AM | Updated on Jul 29 2019 2:44 PM

వేల కోట్ల రూపాయలు వసూలు చేసి జనాన్ని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్‌పై తక్షణమే అసెంబ్లీలో చర్చించాలంటూ ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పట్టుపట్టింది.

సాక్షి, అమరావతి: వేల కోట్ల రూపాయలు వసూలు చేసి జనాన్ని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్‌పై తక్షణమే అసెంబ్లీలో చర్చించాలంటూ ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పట్టుపట్టింది. ఈమేరకు బుధవారం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తిరస్కరించడంతో సభలో వైఎస్సార్‌సీపీ సభ్యులు పెద్దఎత్తున నిరసన తెలిపారు. దీంతో స్పీకర్‌ సభ ప్రారంభమైన పది నిమిషాలకే తొలి వాయిదా వేశారు.

వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయని, ఇప్పటికే 105 మంది ఆత్మహత్య చేసుకున్నారని విపక్ష సభ్యులు స్పీకర్‌ దృష్టికి తీసుకువచ్చారు. సమస్య తీవ్రత దృష్ట్యా తక్షణమే చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement