ఢిల్లీ చేరుకున్న వైఎస్ విజయమ్మ | YS Vijayamma reaches Delhi to meet National leaders | Sakshi
Sakshi News home page

ఢిల్లీ చేరుకున్న వైఎస్ విజయమ్మ

Oct 8 2013 9:33 AM | Updated on Jan 7 2019 8:29 PM

ఢిల్లీ చేరుకున్న వైఎస్ విజయమ్మ - Sakshi

ఢిల్లీ చేరుకున్న వైఎస్ విజయమ్మ

సమైక్యాంధ్రకు జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం మొదలుపెట్టింది‌.

న్యూఢిల్లీ : సమైక్యాంధ్రకు జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం మొదలుపెట్టింది‌. ఇందులో భాగంగా విజయమ్మ నేతృత్వంలో ఓ బృందం మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ముక్కలు కాకుండా చూడాలని జాతీయ నేతలను ఈ బృందం కోరనుంది.

సమైక్యాంధ్ర ఆవశ్యకతను విజయమ్మ జాతీయ నేతలకు వివరించనున్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే ఇరుప్రాంతాల ప్రజలకు కలిగే నష్టాలను ఆమె నేతలకు తెలియజేయనున్నారు. ఇప్పటికే ఇదే విషయంపై జాతీయ స్థాయిలో వివిధ పార్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. విభజన అనే అన్యాయాన్ని అడ్డుకునేందుకు అంతా కలసి ముందుకు రావాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement