
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
‘రాజన్న రాజ్యం మళ్లీ రావాలన్నా..’ అంటూ గుమ్మేపల్లి వద్ద జగన్‌కు హారతిస్తూ డ్వాక్రా చెల్లెమ్మ శైలజ అన్న మాటిది. అప్పుడామె కంఠం కాస్తా జీరబోయి.. కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. ‘మీ చల్లని దీవెనుంటే అదెంత పని..’ అంటూ జగన్ చెబుతుండ గానే ఆమె బావురుమంది.
ఆ పక్కనే ఉన్న డ్వాక్రా అక్కచెల్లెళ్లు కన్నీళ్లను దిగమింగుకుం టూ ‘ఈ రాక్షస పాలన ఇక వద్దన్నా.. బ్యాంకు అప్పు కింద పుస్తెల తాడు కూడా జమైంది.. అయినవాళ్ల కాడ తలెత్తుకో లేకపోతున్నాం.. డ్వాక్రా రుణాలు ఒక్క పైసా కూడా మాఫీ కాలేదు.. జన్మభూమి కమి టీలంట.. వాళ్లు చెప్పినట్టే వినాలంట.. ఇదేం రాజ్యమన్నా..’ అంటూ వాపోయారు.
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 29వ రోజు గురువారం అనంత పురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని కల్లు్లమడి నుంచి ప్రారంభమైంది. గుమ్మేపల్లి వద్ద 400 కిలోమీటర్లు దాటింది. పాదయాత్ర సాగిన మార్గంలో డ్వాక్రా అక్కచెల్లెళ్లు, రైతులు, కుమ్మరి సంఘం నేతలు, నిరుద్యోగులు జగన్‌ను కలిసి తమ కష్టాలు చెప్పుకొన్నారు.