నేడు భీమవరంలో వైఎస్‌ జగన్‌ పర్యటన  | YS Jagan tour in Bhimavaram on April 1 | Sakshi
Sakshi News home page

నేడు భీమవరంలో వైఎస్‌ జగన్‌ పర్యటన 

Apr 1 2019 5:05 AM | Updated on Apr 1 2019 5:05 AM

YS Jagan tour in Bhimavaram on April 1 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం చేస్తారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు విజయనగరం జిల్లా ఎస్‌.కోట, 11.30 గంటలకు విశాఖపట్నం జిల్లా పెందుర్తి, మధ్యాహ్నం 1.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం, 3.30 గంటలకు పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో జగన్‌ ప్రసంగిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

పాలకొండ, రాజాం, పాతపట్నంల్లో వైఎస్‌ విజయమ్మ సభలు
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ నేడు శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ, రాజాం, పాతపట్నం అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు. ఆమె సభల్లోనూ, రోడ్‌షోలలోనూ పాల్గొంటారు. 

పొన్నూరు, తెనాలి, పెనమలూరుల్లో షర్మిల ప్రచారం
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నేడు గుంటూరు జిల్లాలోని పొన్నూరు, తెనాలి, కృష్ణా జిల్లాలోని పెనమలూరు అసెంబ్లీ నియోజక వర్గాల్లో పర్యటించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు. రోడ్‌షో, బహిరంగ సభల్లో ఆమె పాల్గొంటారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement