
సాక్షి, యలమంచిలి: ప్రజల కోసం.. వారి కష్టాలు తెలుసుకునేందుకు.. నేనున్నానని ధైర్యం ఇచ్చేందుకు.. వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విశాఖపట్నంలో అనంతవాహినిలా సాగిపోతోంది. జననేత 245వ రోజు పాదయాత్రను యలమంచిలి నియోజకవర్గం కొత్తపాలెం శివారు నుంచి ప్రారంభించారు.
అక్కడి నుంచి నారాయణపురం, మామిడివాడ మీదుగా గోకివాడ, పంచదార్ల, అప్పరాయడు పాలెం మీదుగా ధారభోగాపురం వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగనుంది. వెల్లువలా జనం వెంటనడువగా... విశాఖ జిల్లా యలమంచిలో వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 2800 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఈ మైలురాయికి గుర్తుగా ఒక మొక్కను నాటారు.