‘మెట్టినింటి వాళ్లు గెంటేశారు’ | women harassment case in nellore | Sakshi
Sakshi News home page

‘మెట్టినింటి వాళ్లు గెంటేశారు’

Apr 7 2017 7:55 AM | Updated on Oct 20 2018 6:19 PM

తనను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డలు పుట్టాక భర్త వదిలేసి పోయాడని, ఆదరించాల్సిన అత్త, మామలు ఇంట్లో నుంచి గెంటేశారని మారుపాకుల ఆదిలక్ష్మి రెండో పట్టణ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది.

 పోలీసులకు మహిళ ఫిర్యాదు 
కావలిరూరల్‌ : తనను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డలు పుట్టాక భర్త వదిలేసి పోయాడని, ఆదరించాల్సిన అత్త, మామలు ఇంట్లో నుంచి గెంటేశారని మారుపాకుల ఆదిలక్ష్మి రెండో పట్టణ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. పట్టణంలోని పెద్దపవని రోడ్డులో పీజీ కాలేజీ ఎదురుగా నివసించే ఆదిలక్ష్మిని తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట కుడకుడ కాలనీకి చెందిన తన మేనమామ కుమారుడు మారుపాకుల బ్రహ్మం ప్రేమించి 2013 ఫిబ్రవరి 14న చేసుకున్నాడని తెలిపింది.
 
అనంతరం తమ అత్త, మామలు పరబ్రహ్మం, పద్మ కట్నం ఇస్తే కానీ ఇంటికి రానివ్వమనడంతో తన తల్లిదండ్రులు తన భర్తకు ఒక మోటారు సైకిల్, లక్ష రూపాయలు కట్నంగా ఇచ్చారన్నారు. పని చేయకుండా తన భర్త అప్పులు చేయడంతో తీర్చడం కోసం మరో రూ.50 వేల డబ్బులు ఇచ్చారని పేర్కొంది. అయితే నాలుగు నెలల క్రితం తన భర్త బ్రహ్మం చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడని, రెండు నెలలుగా అత్తవారింట్లో ఉండగా తనను వారు వేధించారన్నారు. రెండు నెలల క్రితం తనతో పాటు మూడేళ్ల తన కుమారుడు ధనుష్‌తేజ్, 7 నెలల పాప ధన్వితలను ఇంటి నుంచి గెంటి వేశారన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement