'వైఎస్ఆర్ కృషివల్లే గెలిచాం'

we succeed in vamshadhara tribunal by ysr, says ysrcp leaders - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి వల్లే వంశధార ట్రిబ్యునల్‌లో గెలిచామని వైఎస్ఆర్ సీపీ నేతలు పేర్కొన్నారు. వంశధారి నది ఒడ్డున కాట్రగడ్డ వద్ద వైఎస్ఆర్‌కు కృతజ్ఞతాపూర్వకంగా నేతలు నివాళులు అర్పించారు. ఇక్కడ నిర్వహించిన బహిరంగ సభకు వేలాదిగా వైఎస్ఆర్ సీపీ అభిమానులు తరలివచ్చి తమ మద్ధతు తెలిపారు. వైఎస్ఆర్‌కు పేరు వస్తుందని నేరడి బ్యారేజ్ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తే పోరాటం చేస్తామని వైఎస్ఆర్ సీపీ నేతలు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి అన్నారు.

ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ద్వారా జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాలకు వంశధార నీరు తెచ్చే మహత్తర కార్యక్రమం జరిపిస్తామని పార్టీ నేతలు హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒడిషా ప్రభుత్వంతో సమావేశమై ప్రాజెక్టు ముందుకు పోవడానికి అంత్యంత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top