మీ ఓటు.. మీ చేతిలోనే

voter list check in near tahasildar office - Sakshi

 పేరుందో లేదోఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు

తహసీల్దారుకార్యాలయాల్లోనూ జాబితా

తొలగిస్తే అక్కడే ఫిర్యాదు చేయొచ్చు

అనంతపురం అర్బన్‌: మీ ఓటు... మీ చేతిలో ఉంటుంది.  ఈ విషయంలో ఎలాంటి ఆందోళనా వద్దు. జాబితాలో మీ ఓటు ఉందా లేదా అనేది ఆన్‌లైన్‌లోనూ చూసుకోవచ్చు. లేదా తహసీల్దారు కార్యాలయంలోని జాబితాలోనూ చూసుకోవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల సవరణ క్రమంలో మీ ఓటు తొలగించారా... అయితే ఆందోళన వద్దు. మీ ఇంటి వద్దకు విచారణ అ«ధికారులు వస్తారు. విచారణ చేసి వారే నమోదు చేస్తారు. 

ఓటు ఉందా..? లేదా..? ఇలా తెలుసుకోవచ్చు
ఓటు ఉందా లేదా అనేది ఆన్‌లైన్‌లో చూసుకోవాలంటే  ఛ్ఛి్చౌnఛీజిట్చ. nజీఛి. జీn వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఇందులో  ్ఛ్చటఛిజి yౌu n్చఝ్ఛ అనే కాలమ్‌లో ఇంటి నంబర్‌ ఎంటర్‌ చేస్తే ఓటు ఉందో లేదో తెలుస్తుంది. అలా కాకున్నా ఓటరు జాబితాలను తహసీల్దారు కార్యాలయాలు, మున్సిపల్‌ కార్యాలయాలు, రాజకీయ పార్టీలకు ఇచ్చారు. అక్కడ తొలగింపు జాబితా కూడా ఉంటుంది. ఆ జాబితాల్లోనూ ఓటు సమాచారం తెలుసుకోవచ్చు.

ఓటు తొలగించి ఉంటే : ఓటు తొలగించి ఉంటే... ఆ జాబితాను వీఆర్‌ఓలకు అధికారులు పంపించారు. వారు బూత్‌ స్థాయి అధికారితో కలిసి మీ ఇంటికి వస్తారు. తొలగించిన ఓటులోని వ్యక్తి నివాసం ఉన్నాడా..? లేదా అనేది విచారణ చేస్తారు. నివాసం ఉండి కూడా తొలగించి ఉంటే దానిని సరిచేస్తారు. ఫారం–6లో వివరాలు నమోదు చేసుకుంటారు. లేదా మీరు ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి కంప్లైంట్‌ కాలం తెరిచి అందులో నమోదు చేయవచ్చు.

ఓటు నమోదు ఇలా.. : ఓటరు నమోదుకు ప్రత్యేక కార్యక్రమం ఈ నెల 4, 11వ తేదీల్లో నిర్వహించారు. ప్రస్తుతం అభ్యంతరాలు, క్లైములు పరిష్కారం జరుగుతోంది. ఈ ప్రక్రియ మార్చి 5 వరకు జరుగుతుంది. మార్చి 24న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. ఆ తర్వాత 6ఎ ఫారంలో కొత్తగా ఓటరుగా ఫారం–6లో నమోదు చేసుకోవాలి. నేరుగా కాకున్నా ఆన్‌లైన్‌లోనైనా నమోదు చేసుకోవచ్చు.  ఓటరు నమోదుకు ఆధార్‌ తప్పనిసరికాదు. రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, నివాస ధ్రువపత్రం (రేషన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్, పాస్‌పోర్ట్‌) దరఖాస్తుతో జత చేయాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top