జగనానంద కారకా...

Vizianagaram People Celebrations With YS Jagan Schemes - Sakshi

పునఃప్రారంభమైన రాజన్న రాజ్యం

సంక్షేమానికి తెర లేపుతూ జగనన్న ప్రకటన

జూన్‌ నుంచి సామాజిక  పింఛన్‌ మొత్తాల పెంపుదల

స్వాతంత్య్ర దినోత్సవం నాటికి   వలంటీర్ల నియామకం

గ్రామ సచివాలయాలతో ఉద్యోగాల కల్పన

పింఛన్‌ మొత్తాల పెంపుతో  3లక్షల మందికి లబ్ధి

రాష్ట్ర ప్రజల ఆశలు నెరవేరుతున్నాయి. సంక్షేమ రాజ్యం వైపు అడుగులుపడుతున్నాయి. రాబోయే కాలం స్వర్ణయుగంగా మారేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. రాజకీయాలకు... కులమతాలకు అతీతంగా లబ్ధిచేకూర్చేందుకు ఉత్తర్వులు జారీ అవుతున్నాయి. దీనంతటికీ కారణం... ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ నాయకుడు గద్దెనెక్కడమే. అందరి ఆత్మబంధువూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడమే. ఆయన అందరి ఆకాంక్షలు నెరవేరుస్తూ తొలి సంతకం చేశారు. బడుగు బలహీన వర్గాలవారి బతుకుల్లో వెలుగు పూలు పూయించారు. పాలనలో పారదర్శకత అంటే ఏమిటో... సంక్షేమం అంటే ఏమిటో... రాజన్న రాజ్యం ఎలా ఉంటుందో... తొలిరోజే రుచిచూపించారు. పింఛన్‌ మొత్తాలు పెంచుతూ తొలిహామీ నెరవేర్చారు. మరెన్నో వరాలు ప్రకటించారు.

సాక్షిప్రతినిధి విజయనగరం: ఆ మాటల్లో ధైర్యం... ఆ కళ్లల్లో నమ్మకం... ఇచ్చిన ప్రతిమాటా చేసి చూపించే తెగువ... అదీ జననేత జగన్‌మోహన్‌రెడ్డి నైజం. ఆ లక్షణాలన్నీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కనిపించాయి. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను మూడు వేలకు పెంచుకుంటూ వెళ్లేందుకు తొలి సంతకం చేసి తన సత్తా ఏమిటో తెలియజేశారు. కేవలం రెండున్నర నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తానంటూ పెను సంచలనాన్ని రేపారు. అవినీతిలేని పారదర్శక పాలన అందిస్తానంటూ ఇచ్చిన ప్రతిమాటా కచ్చితంగా నెరవేరుతుందనే నమ్మకం తొలి ప్రసంగంలోనే ప్రజలకు కలిగించారు. జిల్లాలో లక్షలాది మందికి జగన్‌ వరాలతో లబ్ధి చేకూరనుంది.

అఖండ విజయంతో సరికొత్త ఆనందం
2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంతోపాటు జిల్లాలో వైఎస్సార్‌సీపీ విజయఢంకా మోగించింది. జిల్లాలో పార్లమెంట్, 9 అసెంబ్లీ స్థానాలను స్వీప్‌ చేసి సత్తాచాటింది. అంతటి విజయాన్ని అందివ్వడానికి కారణం జగన్‌ ఇక్కడి ప్రజలను అంత దగ్గరగా చూడటం... వారి వేదన, రోదన వినడం... వారి కష్టాలు తెలుసుకోవడం ద్వారా వారిలో ఓ నమ్మకాన్ని కలిగించారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు జిల్లా ప్రజలపై వ్యవహరించిన తీరు అత్యంత దారుణం. జన్మభూమి కమిటీల పేరుతో తమ పార్టీ నాయకులనుసభ్యులుగా చేసుకుని వివక్షపూరితంగా పనిచేశారు. జన్మభూమి కమిటీల ఆగడాలు తారాస్థాయికి చేరడంతో పాలనపై ప్రజలు విసుగు చెందారు. చంద్రబాబునాయుడు హయాంలో కేవలం వెయ్యి రూపాయల పింఛను వచ్చేది. నిరుద్యోగులకు ఉపాధి కరువైంది. ఇంటికో ఉద్యోగం హామీ కొండెక్కింది. అన్ని వ్యవస్థల్లోనూ అవినీతి పెచ్చుమీరింది. వీటన్నింటికీ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కడే విరుగుడుగా జనం భావించారు. వారు అనుకున్నట్లు గా నే ఆయన గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సి పల్‌ స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ప్రసంగించారు.

పింఛన్‌తో నవరత్నాలకు శ్రీకారం
నవరత్నాల్లో భాగంగా ఎన్నికల వేళ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన మూడువేలరూపాయల పింఛన్‌ పథకాన్ని వైఎస్సార్‌ పింఛన్‌ పథకం పేరుతో అమల్లోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటిం చారు. జూలై  1వ తేదీ నుంచి ఈ మొత్తాలు పంపిణీ చేసేలా అమలు చేస్తూ తొలి ఏడాది రూ. 2,250లు అందిస్తామని ఆపై ప్రతీ ఏటా రూ.250 లు పెంచుకుంటూ రూ.3వేలకు చేరుస్తామని వివరించారు. జిల్లాలో ప్రస్తుతం వృద్ధులకు రూ.2వేలు, దివ్యాంగులకు రూ. 3 వేలు పెన్షన్‌ గతమూడు నెలలుగా వస్తోంది. అది కూడా జగన్‌ ఇస్తాననడంతో భయపడి ఎన్నికల్లో లబ్ధి కోసం చివరి నిమిషంలో చంద్రబాబు మొదలు పెట్టారు. జగన్‌ తొలి రోజు నుంచే పింఛను పథకాన్ని అమల్లోకి తెచ్చారు. జిల్లాలో వివిధ కేటగిరీ ల్లో 3,06,974 మంది పెన్షనర్లున్నారు. వీరికి ప్రస్తుతం రూ. 64.65కోట్లను ప్రభుత్వం అందిస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతం వస్తున్న పెన్షన్‌కు మరో రూ. 250లు అదనంగా చేర్చడంతో జిల్లాకు మరో రూ. 8 కోట్లు అదనపు భారం పడుతోంది.

నిరుద్యోగుల్లో మోసులెత్తిన ఆశలు
చంద్రబాబు హయాంలో వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు రోడ్డున పడ్డారు. నిరుద్యోగులెవ్వరికి ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. జిల్లాలో 62,410 మంది నిరుద్యోగులు ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వం రూ. 2 వేలు నిరుద్యోగ భృత్తి ఇస్తానని హామీ ఇచ్చి ఎన్నికల వేళ వరకు ఆ హామీని మరచిపోయి చివరి క్షణంలో రూ.వెయ్యితో అరకొరగానే సరిపెట్టిం ది. అదీ డిగ్రీ, డిప్లమో చదివిన వారికి మాత్రమేనని ఆంక్షలు విధించింది. దీనివల్ల జిల్లాలో నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అయితే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 15 నాటికి గ్రామస్థాయిలో ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ నియామకం, అక్టోబర్‌ రెండు నాటికి సచివాలయాల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో జిల్లాలో నిరుద్యోగ సమస్యకు కొంతవరకు పరిష్కారం లభించినట్లయ్యింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్కరికి అందించేందుకు ప్రతీ 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను రూ. 5వేల వేతనంతో నియమిస్తామని మెరుగైన ఉద్యోగం వచ్చేంతవరకు వారు అందులో కొనసాగవచ్చునని సీఎం భరోసానిచ్చారు. అదేవిధంగా  గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి పది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని  చెప్పారు. ఈ చర్యలు నిరుద్యో గ యువతకు కొండంత అండకానున్నాయి.

పారదర్శకతకు అసలైన అర్థం
ఇన్నాళ్లు అవినీతి పాలన చూసి విసిగిపోయిన ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు సీఎం ఆఫీస్‌లోనే కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని ప్రజలెవరైనా అవినీతిపైనా.. తమకు పథ కం సక్రమంగా అందకపోయినా నేరుగా సీఎంకు ఫిర్యాదు చేయవచ్చని విప్లవాత్మక నిర్ణయాన్ని జగన్‌ ప్రకటించడంతో ఎంతోమందికి భరోసా లభించినట్టయింది. జిల్లాలో జన్మభూమి కమిటీల పుణ్యమాని ఒక వర్గానికే పథకాలు లభ్యమయ్యా యి. రెండోవర్గం వారు పూర్తి అర్హతలున్నా నష్టపోయారు. ఇక కాంట్రాక్టుల పేరుతో ఇన్నాళ్లు టీడీపీ నేతలు దోచుకుతిన్నారు. ఇకపై అలా కుదరదు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో అవినీతి లేకుండా చేసేందుకు జ్యుడిషీయల్‌ కమిషన్‌ను  ఏర్పా టు చేయించుకుని ఆ కమిషన్‌ పరిశీలన పూర్తయిన తరువాతనే  టెండర్‌ను ఖరారుచేస్తామని చెప్పడంతో అవినీతి రహిత పాలనకు అంటే ఏమిటో మనం చూడబోతున్నామన్న నమ్మకాన్ని కలిగించారు. జగన్‌ ప్రసంగంతో జిల్లాలో అభిమానులు, ప్రజ లు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకుంటున్నారు.

జనం కోరిక తీర్చిన జగన్‌
ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగానే  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ప్రజల్లో భరోసా కల్పించేలా సందేశాన్నిచ్చారు. నవరత్నాల అమలుపై స్పష్టత ఇవ్వటంతో పాటు పింఛను మొత్తాన్ని రూ2 వేల నుంచి దశల వారీగా రూ3వేలు చేసే ఫైల్‌పై తొలి సంతకం చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అవినీతి లేని పాలన అందిస్తామంటూ నూతన అధ్యయానికి శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో వలంటీర్లు, గ్రామ సచివాలయాల్లో ఉద్యోగుల నియామకం ద్వారా 72 గంటల్లో అర్హత గల వారికి సంక్షేమపథకాలు అమలు చేస్తామనటం శుభ సూచకం. ఐదేళ్ల చంద్రబాబు పాలనకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు పూర్తి వ్యత్యాసం ఉంటుందని మొదటి రోజు స్పష్టత ఇచ్చారు. రానున్న రోజుల్లో ప్రతి సంక్షేమ కార్యక్రమంలో ఎమ్మెల్యేగా నా వంతు కృషి చేస్తాను.
– కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం ఎమ్మెల్యే

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top