విజయనగరం సమీపంలోని గొట్లాం వద్ద సహాయ కార్యకలాపాలను కలెక్టర్ కాంతిలాల్ దండే, జిల్లా ఎస్పీ ఇక్బాల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
విజయనగరం సమీపంలోని గొట్లాం వద్ద సహాయ కార్యకలాపాలను కలెక్టర్ కాంతిలాల్ దండే, జిల్లా ఎస్పీ ఇక్బాల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బాధితులు, మృతుల కుటుంబ సభ్యులు, రైల్లో ఉన్న ప్రయాణికులతో వాళ్లు నేరుగా మాట్లాడుతున్నారు. రైల్లో ఎక్కువ మంది ఒడిషా, పశ్చిమ బెంగాల్ వాసులు ఉండటంతో, వారికి హిందీ తప్ప తెలుగు తెలిసే అవకాశం తక్కువగా ఉండటంతో జిల్లా ఉన్నతాధికారులు వాళ్లతో మాట్లాడి సహాయ కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నారు.
రైలు ప్రమాదం సంభవించిన గొట్లాం ప్రాంతానికి స్థానిక ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి చేరుకున్నారు. సంఘటన జరిగిన తీరును అక్కడ ఉన్నవారిని అడిగి తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. బాధితుల వివరాలను కలెక్టర్ కాంతిలాల్ దండే, ఎస్పీ ఇక్బాల్ లను అడిగి తెలుసుకున్నారు.