విజయనగరం జిల్లా గుర్ల మండలం తాడిపూడి పంచాయతీ మధురై గ్రామం చిన్ననాగవలసలో విషజ్వరాలు ప్రబలాయి.
గుర్ల : విజయనగరం జిల్లా గుర్ల మండలం తాడిపూడి పంచాయతీ మధురై గ్రామం చిన్ననాగవలసలో విషజ్వరాలు ప్రబలాయి. నాలుగు రోజులుగా విషజ్వరాలతో తల్లడిల్లిపోతున్నా వైద్యులు పట్టించుకోవడంలేదు. ఈ గ్రామం గరివిడి పీహెచ్‌సి పరిధిలో ఉండడంతో గుర్ల పీహెచ్‌సి వైద్యులు అక్కడికెళ్లి వైద్యశిబిరం ఏర్పాటు చేసే వీలులేదు. గరివిడి పీహెచ్‌సీ వాళ్లకు ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.