'జైపాల్ రెడ్డి... ముఖాముఖి చర్చకు సిద్దమేనా' | Undavalli arun kumar dares Jaipal reddy for open debate on state bifurcation | Sakshi
Sakshi News home page

'జైపాల్ రెడ్డి... ముఖాముఖి చర్చకు సిద్దమేనా'

Jan 12 2014 1:51 PM | Updated on Sep 27 2018 5:59 PM

'జైపాల్ రెడ్డి... ముఖాముఖి చర్చకు సిద్దమేనా' - Sakshi

'జైపాల్ రెడ్డి... ముఖాముఖి చర్చకు సిద్దమేనా'

కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిపై రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిపై రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. అందుకు ఆయన సిద్దమేనా అన్ని జైపాల్ రెడ్డికి ఉండవల్లి సవాల్ విసిరారు. సీమాంధ్రులను కించపరిచేలా జైపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రమంత్రి అయి ఉండి సీమాంధ్రులను కించపరచడం పద్దతి కాదని హితవు పలికారు.

 

అమరజీవి పొట్టి శ్రీరాములు, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహోన్నత వ్యక్తులు పుట్టిన ప్రాంతంలో ఇప్పుడు శుంఠలు పుట్టారని తెలంగాణ వ్యతిరేకులనుద్దేశించి కేంద్రమంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్పై విధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement