కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పరిటాల వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
కంచికచర్ల: కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పరిటాల వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి నందిగామ వైపు వెళుతున్న లారీని, డ్రైవర్ ఒక్కసారిగా సడెన్ బ్రేక్ వేసి నిలిపాడు. దీంతో వెనుక నుంచి వస్తున్న బైక్ లారీని ఢీకొంది.
బైక్‌పై ఉన్న ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు నందిగామ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతులను కంచికచర్లకు చెందిన గాజుల గోపి (19), బత్తుల హర్ష(20)గా గుర్తించారు.