ఇది దున్నపోతు ప్రభుత్వం | this is buffalo govt | Sakshi
Sakshi News home page

ఇది దున్నపోతు ప్రభుత్వం

Feb 20 2014 3:55 AM | Updated on Jun 2 2018 8:39 PM

ఇది దున్నపోతు ప్రభుత్వం - Sakshi

ఇది దున్నపోతు ప్రభుత్వం

సమస్యలు పరిష్కరించాలని మూడు రోజులుగా రో అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నా

ఇది దున్నపోతు ప్రభుత్వం
 దేవరకద్ర  : సమస్యలు పరిష్కరించాలని మూడు రోజులుగు అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నా ఈ ప్రభుత్వం స్పందించకుండా దున్నపోతులా వ్యవహరిస్తోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీహరి విమర్శించారు.
 
 బుధవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీల పనిగంటలు పెంచడాన్ని విరమించుకోవాలని, బీఎల్‌ఓల బాధ్యతల నుంచి మినహారుుంపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ. 10 వేలు ఇవ్వాలని, పెన్షన్‌తో పాటు పదవీ విరమణ బెనిఫిట్స్ ఇవ్వాలని, అంగన్‌వాడీ కేంద్రాల్లో జోక్యాన్ని కల్పిస్తూ ఐటీసీ సంస్థలకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని, ఐకేపీల జోక్యాన్ని కూడా రద్దు చేయాలని కోరారు.
 వంట సరఫరా గ్యాస్ సబ్సిడీపై అందించాలని కోరారు. ధరల పెరుగుదరలకు అనుగుణంగా మెను చార్జీలు పెంచాలని, అంగన్‌వాడీ కేంద్రాలకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ అంజిరెడ్డికి డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా నాయకులు శ్రీనివాస్. అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ, ప్రధానా కార్యదర్శి వరలక్ష్మీ, ఇంకా పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement