నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ శ్రేణులు శనివారం ఆందోళనకు దిగారు.
నాగార్జున సాగర్ : నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ శ్రేణులు శనివారం ఆందోళనకు దిగారు. ఏపీ ఇరిగేషన్ అధికారులు, పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు సాగర్కు ఇరువైపులా పోలీసులు భారీగా మోహరించారు.
కాగా నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటిని విడుదల చేసుకోవడానికి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ చేసిన ప్రయత్నం... ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే.. సాగర్ ప్రాజెక్టుపైనే ఇరు రాష్ట్రాల అధికారులు, పోలీసుల వాగ్వాదం, తోపులాటతో పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇరు రాష్ట్రాల పోలీసులు పరస్పరం లాఠీలు ఝుళిపించుకునే వరకు వచ్చింది. ఈ ఘటనలో పలువురికి గాయాలుకాగా... సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.