అందుకే టీ.కాంగ్రెస్ నేతలు సీఎంకు దూరం | Telangana congress leaders are not connected with kiran kumar reddy, says DK Aruna | Sakshi
Sakshi News home page

అందుకే టీ.కాంగ్రెస్ నేతలు సీఎంకు దూరం

Sep 10 2013 11:24 AM | Updated on Jul 29 2019 5:31 PM

అందుకే టీ.కాంగ్రెస్ నేతలు సీఎంకు దూరం - Sakshi

అందుకే టీ.కాంగ్రెస్ నేతలు సీఎంకు దూరం

రాష్ట్ర విభజన ఆపుతామంటూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆప్రాంత ప్రజలను మభ్యపెడుతున్నారని మంత్రి డీకె అరుణ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ : రాష్ట్ర విభజన ఆపుతామంటూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆప్రాంత ప్రజలను మభ్యపెడుతున్నారని మంత్రి డీకె అరుణ వ్యాఖ్యానించారు. ఎవరెన్ని చేసినా విభజన ప్రక్రియ ఆగదని ఆమె మంగళవారమిక్కడ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కేవలం సీమాంధ్ర ప్రాంతానికి మాత్రమే సీఎంగా వ్యవహరిస్తున్నారని  డీకె అరుణ ఆరోపించారు.

 

అందుకే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రికి దూరంగా ఉంటున్నారని ఆమె తెలిపారు.  ఇరుప్రాంతాల నేతలతో ముఖ్యమంత్రి చర్చలు జరపాలని డీకె అరుణ డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఈరోజు ఉదయం సీఎల్పీ కార్యాలయంలో సమావేశం కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement