రెచ్చిపోతున్న తెలుగు తమ్ముడు.. | tdp followers over action in vijayanagaram district | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న తెలుగు తమ్ముడు..

May 23 2016 4:01 PM | Updated on Aug 28 2018 7:24 PM

రెచ్చిపోతున్న తెలుగు తమ్ముడు.. - Sakshi

రెచ్చిపోతున్న తెలుగు తమ్ముడు..

అధికార పార్టీ అండదండలున్నాయంటూ ఓ తెలుగు దేశం కార్యకర్త రెచ్చిపోతున్నాడు.

 - రియల్టర్లపై పెత్తనం   
విజయనగరం: అధికార పార్టీ అండదండలున్నాయంటూ ఓ తెలుగు దేశం కార్యకర్త రెచ్చిపోతున్నాడు. విజయనగరం జిల్లా కేంద్రంలోని రియల్టర్లు, వ్యాపారులను బెదిరిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. గాజులరేగ ప్రాంతానికి చెందిన నడిపిల్లి రవికుమార్ అనే తెలుగుదేశం సీనియర్ కార్యకర్త జిల్లా కేంద్రంలోని పలువురు వ్యాపారులపై పెత్తనం ప్రదర్శిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. జేఎన్‌టీయూ సమీపంలోని శుభకరి రియల్ ఎస్టేట్ పేరుతో పెంటపాటి సురేష్ కుమార్ అనే వ్యాపారి లే ఔట్ వేశారు. ద్వారపూడి రెవెన్యూలోని సర్వే నంబర్లు 78-2, 99-3లలో  21.50 ఎకరాలను రియల్టర్ కొనుగోలు చేశారు. ఇందులో 15.50 ఎకరాల్లో లే ఔట్ వేశారు. దీనికి ముఖద్వారం నిర్మించే సమయంలో రియల్టర్ ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడని గతంలో నడిపిల్లి రవికుమార్  తహశీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారులు సర్వే చేపట్టి ఆక్రమణలున్నాయని ప్రకటించారు.

దీనిపై రియల్టర్ సురేష్‌కుమార్ ఆర్డీఓకు అప్పీల్ చేసుకున్నాడు. వాస్తవానికి 30 రోజుల గడువు ఇవ్వాల్సి ఉన్నా అధికారులు ఐదు రోజుల్లోనే ముఖద్వారం కూలగొట్టడంతో బాధితుడు రెవెన్యూ మంత్రి, సీసీఎల్‌ను ఆశ్రయించాడు. దీనిపై సీసీఎల్‌ఏ కలెక్టర్, ఆర్డీఓలకు నోటీసులిచ్చింది. విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నంత వరకూ స్టేటస్ కో ఇచ్చింది. అయితే టీడీపీ నాయకుడు నడిపిల్లి రవికుమార్ ఇవేమీ పట్టించుకోకుండా తనను బెదిరిస్తున్నాడని సురేష్‌కుమార్ ఆరోపించారు. ఇప్పటికే తన వద్ద నుంచి లక్షలాది రూపాయలు తీసుకున్నాడని, ఇంకా డబ్బుకోసం తనను వేధిస్తున్నాడని ఇతని తీరుతో రియల్టర్లందరూ ఇబ్బంది పడుతున్నారన్నారు. త్వరలో ఇతనిపై  అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement