ఎంపీ అనంత నివాసాన్ని ముట్టడించిన విద్యార్థులు | Students protests at MP Anantha Venkata Rami Reddy house | Sakshi
Sakshi News home page

ఎంపీ అనంత నివాసాన్ని ముట్టడించిన విద్యార్థులు

Nov 13 2013 11:36 AM | Updated on Nov 9 2018 4:46 PM

సమైక్యాంధ్ర మద్దతుగా అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి వెంటనే తమ పదవికి రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

సమైక్యాంధ్ర మద్దతుగా అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి వెంటనే తమ పదవికి రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్
చేశారు. బుధవారం అనంత నివాసాన్ని విద్యార్థులు ముట్టడించారు. అనంత రాజీనామా చేయాలని విద్యార్థులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆ క్రమంలో అనంత నివాసంలోకి చొచ్చుకుపోయేందుకు విద్యార్థులు ప్రయత్నించారు.

 

దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి, వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అందులో భాగంగా విద్యార్థులను చెదరగొట్టేందుకు యత్నించారు. దాంతో పోలీసులు, విద్యార్థులు మధ్య తొపులాట చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని నగరంలోని పోలీసు స్టేషన్కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement