బండల లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి మహబూబ్‌నగర్ భూత్‌పూర్ మార్గంలో బోల్తా కొట్టింది.
మహబూబ్‌నగర్ క్రైం,న్యూస్‌లైన్: బండల లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి మహబూబ్‌నగర్ భూత్‌పూర్ మార్గంలో బోల్తా కొట్టింది. ఈ సంఘటన మంగళవారం క్రిష్టియన్‌పల్లి శివారులో చోటు చేసుకుంది . ప్రమాదంలో డ్రైవర్ రాజు స్వల్ప గాయాలతో బయటపడ్డా డు. గమనించిన స్థానికులు క్షతగ్రాతున్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. తమిళనాడుకు చెందిన లారీ తాండూర్ నుంచి బండల లోడుతో భూత్‌పూర్ వైపు వెళ్తోంది. అదుపు తప్పి రోడ్డుకు అడ్డంగా బోర్లా పడింది. ఇది హైవే రోడ్డుకు వెళ్లే కీలక రహదారి కావడంతో వాహనాదారులు అవస్థల పాలయ్యారు . దీంతో పాటు జిల్లా కేంద్రానికి వచ్చే వాహనాలు , ఈ మార్గంలో నడిచే నాగర్‌కర్నూల్, వనపర్తి, కొత్తకోట, శ్రీశైలం వెళ్లే బస్సులు, ద్విచక్ర వాహనదారులు, వివిధపనులపై జిల్లాకేంద్రానికి రాకపోకలు సాగించిన వారు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.
తెల్లవారు జామునే లారీ బోల్తా పడినా సంబంధిత అధికారులు కానీ, పోలీసు లు కానీ వాహనాన్ని రోడ్డుపై నుంచి తొలగించ లేక పోయారు. సుమారు 18గంటలపాటు ఇబ్బందుల మధ్యే రవాణా అతికష్టం మీద సాగింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో రూరల్ పోలీసులు స్పందించి జేసీబీతో లారీని రోడ్డు నుంచి పక్కకు తొలగించడంతో ట్రాఫిక్‌కు ఏర్పడిన అంతరాయం క్లియర్ అయ్యింది.