స్పీడ్‌పోస్టు, రిజిస్టర్‌పోస్టు, ఎంవో వినియోగదారులకు ఎస్‌ఎంఎస్ అలర్టు సేవలు ప్రవేశపెడుతున్నట్లు చీఫ్ పోస్ట్ మాస్టర్ బీవీ సుధాకర్ వెల్లడించారు.
జాతీయ తపాలా వారోత్సవాల ముగింపు సభలో చీఫ్ పోస్ట్ మాస్టర్ వెల్లడి
ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు
హైదరాబాద్, న్యూస్‌లైన్: స్పీడ్‌పోస్టు, రిజిస్టర్‌పోస్టు, ఎంవో వినియోగదారులకు ఎస్‌ఎంఎస్ అలర్టు సేవలు ప్రవేశపెడుతున్నట్లు చీఫ్ పోస్ట్ మాస్టర్ బీవీ సుధాకర్ వెల్లడించారు. ఇక్కడి అబిడ్స్‌లోని డాక్ సదన్‌లో జాతీయ తపాలా వారోత్సవాల ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ప్రవేశ పెడుతున్న తపాలా సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఉద్యోగులకు సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ఆయన అవార్డులు ప్రదానం చేశారు. స్పీడ్‌పోస్టు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ విజయవాడ డివిజన్‌కు చెందిన డి.శ్రీనివాసరావు ప్రథమ, విశాఖపట్నం డివిజన్‌కు చెందిన వి.సుధాకర్‌బాబు ద్వితీయ, శ్రీకాకుళం డివిజన్‌కు చెందిన జి.యు.ఎస్.గుప్తా తృతీయ బహుమతులు అందుకున్నారు. సూపర్‌వైజర్ కేటగిరీలో హుజూర్‌నగర్ సబ్‌డివిజన్‌కు చెందిన వి.వెంకటేశ్వర్లు మొదటి గ్రేడ్ అవార్డును అందుకున్నారు. పోస్టుమ్యాన్ కేటగిరీలో శివరాంపేట్ డివిజన్‌కు చెందిన బి.రమణ మొదటి, చిత్తూరు డివిజన్‌లోని అంబరీష్ నాయుడు రెండో గ్రేడ్ అవార్డులను అందుకున్నారు. పోస్టులైఫ్ ఇన్యూరెన్స్(పీఎల్‌ఐ) బెస్టు ఫెర్ఫార్మర్ గా విశాఖపట్నం రీజయన్ నుంచి సి.హెచ్.వి.డి.కె.మూర్తి నాయుడు, బెస్టు ఫీల్డ్ ఆఫీసర్‌గా హైదరాబాద్ సౌత్ ఈస్టు డివిజన్ నుంచి జె.బాల్‌రెడ్డి, బెస్టు డిపార్టుమెంటల్ ఎంప్లాయిలుగా హైదరాబాద్ సౌత్‌డివిజన్ నుంచి కె.కిరియా, కర్నూలు డివిజన్ నుంచి బి.మహబూబ్‌బాషా, ఎస్.టిప్లా నాయక్, గుంటూరు డివిజన్ నుంచి బోయపాటి ప్రశాంతి, కాకినాడ డివిజన్ నుంచి జి.సుబ్బారావు, అనకాపల్లి నుంచి జి.జగదీష్‌లు అవార్డులు అందుకున్నారు.
రూరల్ పోస్టులైఫ్ ఇన్స్యూరెన్స్‌లో బెస్టు డిపార్టుమెంటల్ ఎంప్లాయీలుగా భీమవరం నుంచి ఎస్‌ఎన్.సి.హెచ్.ఎస్.కె.వి.ఎస్.ఆర్. ఆచార్యులు, కె.ఎస్.బి.రామాచార్యులు, కర్నూలు రీజియన్ నుంచి ఎస్.నర్సింహులు అవార్డులు చేజిక్కించుకున్నారు. బెస్టు గ్రామీణ్ డాక్ సేవక్ కేటగిరీలో భీమవరం డివిజన్ నుంచి ఎం.విజయ్‌కుమార్, విజయవాడ డివిజన్ నుంచి ప్రసాద్, విజయవాడ రీజనల్ ఆఫీసర్ పుండరీకాక్షుడులు అవార్డులు అందుకోగా బెస్టు డెరైక్టు ఏజెంట్ కేటగిరిలో కర్నూలు రీజియన్ నుంచి జగదీశ్వరయ్య, పద్మజ, తెనాలి డివిజన్ నుంచి ఎ.సరిత అవార్డులు దక్కించుకున్నారు.