కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా చక్రపాణి గెలుపు | shilpa chakrapanireddy won in kurnool MLC election | Sakshi
Sakshi News home page

కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా చక్రపాణి గెలుపు

Jul 7 2015 10:53 AM | Updated on Aug 29 2018 6:26 PM

కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా చక్రపాణి గెలుపు - Sakshi

కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా చక్రపాణి గెలుపు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్ధి శిల్పా చక్రపాణిరెడ్డి విజయం సాధించారు.

కర్నూలు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్ధి శిల్పా చక్రపాణిరెడ్డి విజయం సాధించారు. 126 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థికి 600 ఓట్లు పోలవ్వగా, వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 474 ఓట్లు పోలయ్యాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు. కాగా, ఇండిపెండెంట్ అభ్యర్ధికి కేవలం 2 ఓట్లు పోలయ్యాయి.

కర్నూలు టౌన్ మోడల్ స్కూలులో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. అయితే, కౌంటింగ్ హాలులోకి మీడియాను పోలీసులు అనుమతించలేదు. ఇందుకు నిరసనగా జర్నలిస్టులు ధర్నాకు దిగారు. ఈ నెల 3వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ప్రకాశం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement