విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వ చెలగాటం | Scholarships and Fees Reimbursement Schemes in doldrums | Sakshi
Sakshi News home page

విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వ చెలగాటం

Jan 9 2014 5:31 AM | Updated on Sep 15 2018 4:12 PM

రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఏబీవీపీ నాయకులు భానుచందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఖలీల్‌వాడి,న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్  ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఏబీవీపీ నాయకులు భానుచందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం  స్థానిక  పులాంగ్ చౌరస్తా వద్ద  రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా భానుచందర్  మాట్లాడుతూ.. విద్యార్థులకు రూ. 4,900 కోట్ల స్కాలర్‌షిప్‌లు,ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కావాల్సి ఉందన్నారు.  స్కాలర్‌షిప్‌కు ఆధార్‌కార్డును  అనుసంధానం చేయడంతో జిల్లాలో 35వేల మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌లు పొందే అవకాశం లేదన్నారు. వెంటనే  ప్రభుత్వం ‘ఆధార్’ ఉత్తర్వులను ఉపసంహరిం చు కోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
 
 ఇదే విషయంలో  హైదరాబాద్‌లోని మం త్రుల ఇళ్ళను ఏబీవీపీ నాయకులు ముట్టడిం చగా, వారిని అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. వెంటనే  వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే  అసెంబ్లీని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు తుకారాం,రాకేష్,లకన్,సురేష్,రఘువీర్,నరేష్,సాయితేజ,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement