ఈ-పాస్‌లతో ప్రతి నెల రూ.12 కోట్లు ఆదా | Rs 12 crore every month to save ee-passes | Sakshi
Sakshi News home page

ఈ-పాస్‌లతో ప్రతి నెల రూ.12 కోట్లు ఆదా

May 29 2016 3:15 AM | Updated on Sep 4 2017 1:08 AM

ఈ-పాస్‌లతో ప్రతి నెల రూ.12 కోట్లు ఆదా

ఈ-పాస్‌లతో ప్రతి నెల రూ.12 కోట్లు ఆదా

ప్రజా పంపిణీలో ఈ-పాస్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత అక్రమాలకు అడ్డుకట్ట పడి ప్రతి నెల దాదాపు...

ఆహార సలహా సంఘం సమావేశంలో జేసీ
 
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజా పంపిణీలో ఈ-పాస్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత అక్రమాలకు అడ్డుకట్ట పడి ప్రతి నెల దాదాపు రూ.12 కోట్లు ఆదా అవుతున్నాయని జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆహార సలహా సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రతి రేషన్ షాపులో కేవలం ఈ-పాస్‌కు సంబంధించిన వేయింగ్ మిషన్ మాత్రమే ఉండాలని ఇతరత్రా ఎలాంటి వేయింగ్ మిషన్‌లు ఉండరాదన్నారు. అలా ఉంటే సంబంధిత సీఎస్‌డీటీలను బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటామని వివరించారు. మొత్తం కార్డుల్లో 75 శాతం కార్డులకు మొదటి 3 రోజుల్లో సరుకులు పంపిణీ అవుతున్నాయని మిగిలిన వాటికి 15 వరకు పంపిణీ సరుకుల పంపణీ జరుగుతుందని వివరించారు. ఈ-పాస్‌ల్లో వేలి ముద్రలు పడకపోతే ఐరీస్‌ను పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు.


 సభ్యుల ప్రశ్నలు
కొందరు డీలర్లు బోగస్ రేషన్ కార్డులకు ఆధార్ నెంబర్లు లింకప్ చేసి యథావిదిగా అక్రమాలకు పాల్పడుతున్నారని శనివారం ‘సాక్షి’లో ప్రచురితం అయిన కథనాన్ని ప్రస్తావిస్తూ వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని సీపీఐ నగర కార్యదర్శి రసూల్ కోరారు.
కర్నూలులోని ఐనాక్స్ థియేటర్‌లో రూ.10 వస్తువును రూ.50కి అమ్ముతున్నారని బయటి నుంచి కనీసం మంచినీళ్లను కూడా అనుమతించడం లేదని దీనిపై చర్యలు తీసుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు తోట వెంకటకృష్ణారెడ్డి తెలిపారు.
రేషన్ సరుకులను ప్రతి నెల 20 వరకు పంపిణీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు షడ్రక్ తెలిపారు.  
ప్రజా పంపిణీలో అమలుపై తీసుకోవాల్సిన చర్యలపై తీర్మానం చేయాలని మాజీ జెడ్పీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి డియాండ్ చేశారు. పండ్లను మాగించడంలో కార్బైడ్‌ను యథేచ్ఛగా వాడుతున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement