అసెంబ్లీలో కంటతడి పెట్టిన రోజా | rk roja breaks down in assembly | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో కంటతడి పెట్టిన రోజా

Dec 22 2014 2:28 PM | Updated on Jul 12 2019 5:45 PM

అసెంబ్లీలో కంటతడి పెట్టిన రోజా - Sakshi

అసెంబ్లీలో కంటతడి పెట్టిన రోజా

టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి శాసనసభలో నోటిదురుసు ప్రదర్శించారు.

హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి శాసనసభలో నోటిదురుసు ప్రదర్శించారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులపై అభ్యంతకర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ దూషించారు.  వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రౌడీయిజం చేస్తున్నారంటూ ఒంటికాలిపై లేచారు.

మహిళా ఎమ్మెల్యే రోజాపై వ్యక్తిగత దూషణలకు దిగారు. రోజా లేడీ విలన్ లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పచ్చి బూతులు మాట్లారని ధ్వజమెత్తారు. సభలో తనకు జరిగిన అవమానంపై మాట్లాడేందుకు అవకాశమివ్వాలని రోజా ప్రాధేయపడినా స్పీకర్ కనిరించలేదు.

గోరంట్ల వ్యాఖ్యలతో నొచ్చుకున్న రోజా సభలో కంటతడి పెట్టారు. రోజాపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన బుచ్చయ్య చౌదరి క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఇంతలోనే స్పీకర్ సభను వాయిదా వేశారు. సభ వాయిదా తర్వాత కూడా వైఎస్సార్ సీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement