ఎర్రచందనం విక్రయానికి ఈ నెల 20వ తేదీలోగా టెండర్లు ఆహ్వానించనున్నట్లు అటవీశాఖ చీఫ్ కన్సర్వేటర్ మురళీకృష్ణ తెలిపారు
విశాఖపట్నం(అరకులోయ): ఎర్రచందనం విక్రయానికి ఈ నెల 20వ తేదీలోగా టెండర్లు ఆహ్వానించనున్నట్లు అటవీశాఖ చీఫ్ కన్సర్వేటర్ మురళీకృష్ణ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆధీనంలో సుమారు 3,500 టన్నుల ఎర్రచందనం ఉందన్నారు. గతంలో టన్నును రూ.27 లక్షల నుంచి రూ.28 లక్షల వరకు విక్రయించినట్లు తెలిపారు.
ప్రస్తుతం ఎర్రచందనం దొంగలను అదుపు చేయగలిగామని, కొన్ని ప్రాంతాల్లో కొత్త టెక్నాలజీతో సీసీ కెమెరాలు వాడుతున్నామని, సిబ్బందిని కూడా పెంచామని చెప్పారు. పోలీస్ శాఖ నుంచి 150 తుపాకులు తీసుకున్నామని, మరో 250 తుపాకులు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. 2003లో 1,800 టన్నులు, గత ఏడాది 880 టన్నుల ఎర్రచందనం పట్టుకున్నట్లు తెలిపారు.