వనపర్తి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో 130 గ్రామాలలో బుధవా రం లోఓల్టేజీ,విద్యుత్ కోతలు ఎదురయ్యాయి.
సబ్‌స్టేషన్ వద్ద తలెత్తిన సాంకేతిక లోపాల్ని సరిదిద్దక పోవడంతో వనపర్తి ప్రాంతంలోని 130 పల్లెలు విద్యుత్తు సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. విద్యార్థులకు పరీక్షలు, పంటలకు నీటి సరఫరా వంటి ముఖ్య అవసరాలకు కరెంటు లేక అగచాట్లు ఎదురవుతున్నారు. స్పందించాల్సిన అధికారులు చేతులు కట్టుకొని చోద్యం చూస్తున్నారు.
వనపర్తి,న్యూస్‌లైన్: వనపర్తి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో 130 గ్రామాలలో బుధవా రం లోఓల్టేజీ,విద్యుత్ కోతలు ఎదురయ్యాయి. వనపర్తి పట్టణంలోని 33/11 కేవి విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి ప్రతి రోజు 90 మెగావాట్ల విద్యు త్ వనపర్తి, కొల్లాపూర్, దేవరకద్ర నియోజక వర్గాల్లోని గ్రామాలకు విద్యుత్ సరఫరా అవుతుంది. అయితే సబ్ స్టేషన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో గత రెండు రోజులుగా వనపర్తి పట్టణంతో పాటు 130 గ్రామాలకు విద్యు త్ సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. రో జులో మరీ దారుణంగా రెండుగంటలకు మిం చి విద్యుత్తు సరఫరా కాలేదు.
దీంతో ఆయా గ్రామాల వారు తీవ్ర ఆవేదన వ్యక్తపరిచారు. ఈ విషయమై వనపర్తి డీఈ సుదాకర్‌తో పాటు కింది స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రస్తుతం పరీక్షలు రాస్తున్న ఇంటర్ విద్యార్థులు, రైతులు, చిరు వ్యాపారులు ఇబ్బం దులు పడుతున్నారు. ఈ విషయాన్ని ముందస్తుగా ప్రజలకు తెలియజేయాల్సిన విద్యుత్ అ ధికారులు మొహం చాటేయడంతో విద్యుత్ వినియోగదారులు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. కనీసంజరుగుతున్న అంతరాయాన్ని కూడా పత్రికలకు తెలియడంలోనూ వీరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
ఫోన్లు చేసినా ఎవ్వరు స్పందించకపోవడంతో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి సర్వత్రా నెలకొంది. వనపర్తి మండలంలోని ఐదు మండలాలు, దేవరకద్ర నియోజక వర్గంలోని రెండు, కొల్లాపూర్ లో మూడు మండలాల్లో చీకట్లు కమ్ముకున్నా యి. డిమాండ్ 90 మెగా వాట్లు ఉండగా సప్లై 45 మెగావాట్లు ఉండడంతో ఒకవైపు విద్యుత్ సరఫరా ఉంటే మరొక వైపు అనదికారికంగా కోతలను విదిస్తున్నారని వినియోగదారులు ఆ రోపిస్తున్నారు. రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఒక ఫీడర్ ద్వారా అందించడంతో ఓ 60 పల్లెలకు విద్యుత్తు అందినా మిగతా 70 ఊళ్లు చీకట్లోనే మగ్గాయి.