టీచర్లకు స్థాన చలనం | Positioning motion to teachers | Sakshi
Sakshi News home page

టీచర్లకు స్థాన చలనం

Oct 27 2015 12:32 AM | Updated on Sep 3 2017 11:31 AM

రెండు నెలలుగా టీచర్లను ఊరిస్తున్న బదిలీలు రెండు మూడు రోజుల్లో జరగనున్నాయి.

రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదల
2,384మందికి అవకాశం

 
మహారాణిపేట(విశాఖపట్నం:   రెండు నెలలుగా టీచర్లను ఊరిస్తున్న బదిలీలు రెండు మూడు రోజుల్లో జరగనున్నాయి. సీనియారిటీ ప్రకారం, పాయింట్లవారీగా కసరత్తు చేసి జిల్లా విద్యాశాఖ నివేదిక తయారు చేసి రాష్ట్ర విద్యాశాఖకు పంపించిన విషయం తెలిసిందే. దీని ఆధారంగా రాష్ట్ర విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన షెడ్యూల్‌ను రెండు రోజుల్లో  విడుదల చేయనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ రమ్మని జిల్లా విద్యాశాఖాధికారికి సమాచారం అందింది. జిల్లాలో మొత్తం 2,384 టీచర్
 పోస్టుల బదిలీలకు గాను 4,162మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు.

 బదిలీలు జరిగే టీచర్ల సంఖ్య కేటగిరీల వారీగా: గ్రేడ్-2 హెచ్‌ఎం-128, స్కూల్ అసిస్టెంట్ (మేథ్స్)- 120, స్కూల్ అసిస్టెంట్ (పీఎస్)-46, స్కూల్ అసిస్టెంట్ (బీఎస్)- 44, స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఎస్)-160, స్కూల్ అసిస్టెంట్ (పీడీ)-4, స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)-33, స్కూల్ అసిస్టెంట్ (హిందీ)-13, స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్)-43, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం (తెలుగు)-160, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం (ఉర్దూ)-2, ఎస్జీటీ (తెలుగు)-1453, ఎస్జీటీ (ఉర్దూ)-13, పీఈటీ-30, ఎల్‌పీటీ-38, ఎల్‌పీహెచ్-67, ఎల్‌పీ ఉర్దూ-1, క్రాఫ్ట్-5, డ్రాయింగ్-21, మ్యూజిక్-3 ఖాళీలు భర్తీ కానున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement