
ఏపీలో గణతంత్ర వేడుకలకు గవర్నర్
వచ్చే నెల 26వ తేదీన విజయవాడ నగరంలో జరిగే గణతంత్ర వేడుకల్లో గవర్నర్ నరసింహన్ పాల్గొంటారని మేయర్ కోనేరు శ్రీధర్ చెప్పారు.
విజయవాడ: వచ్చే నెల 26వ తేదీన విజయవాడ నగరంలో జరిగే గణతంత్ర వేడుకల్లో గవర్నర్ నరసింహన్ పాల్గొంటారని మేయర్ కోనేరు శ్రీధర్ చెప్పారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ మాట్లాడుతూ.. జనవరి 25వ తేదీన గవర్నర్ నగరానికి చేరుకుంటారని తెలిపారు.
26వ తేదీ ఉదయం 8 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొంటారని, 10 గంటలకు హైదరాబాద్‌కు తిరిగి వెళతారని చెప్పారు. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు.