జగన్ మా గుండెల్లో ధైర్యాన్ని నింపారు | My heart was filled courage ys Jagan | Sakshi
Sakshi News home page

జగన్ మా గుండెల్లో ధైర్యాన్ని నింపారు

Jun 25 2014 1:54 AM | Updated on Jul 28 2018 3:23 PM

జగన్ మా గుండెల్లో ధైర్యాన్ని నింపారు - Sakshi

జగన్ మా గుండెల్లో ధైర్యాన్ని నింపారు

‘ఆయుష్’ ఉద్యోగులను కొనసాగించాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడి తమ గుండెల్లో ధైర్యాన్ని నింపారని ఉద్యోగులు పేర్కొన్నారు.

 భీమవరం క్రైం : ‘ఆయుష్’ ఉద్యోగులను కొనసాగించాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడి తమ గుండెల్లో ధైర్యాన్ని నింపారని ఉద్యోగులు పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం పోరాటాలకు వెనుకాడమని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టాక గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ‘ఆయుష్’ ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ఉద్యోగులను తొలగించాలని చూడటం దారుణమన్నారు. జిల్లా వ్యాప్తంగా 44 డిస్పెన్సరీల్లో పనిచేస్తున్న 81 మంది ఆయుష్ ఉద్యోగులను ఇంటికి పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ తమకు అండగా ఉందని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాలు రోడ్డున పడకుండా అండగా ఉండాలని వారు కోరుతున్నారు.
 
 జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాం
 ఆయుష్ ఉద్యోగులను తొలగించడం సబుబు కాదని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడటం ఎంతో సంతోషాన్ని కలిగిం చింది. ఆయనకు మేమంతా రుణపడి ఉంటాం. జిల్లాలో జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకంలో ఆయుష్ శాఖ ద్వారా ఉద్యోగాలు పొందిన 81 మంది జిల్లాలోని 44 డిస్పెన్సరీల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. వారిని తొలగించడం సరికాదు.  
 - డాక్టర్ జీఎన్‌బీ ప్రసాద్, మెడికల్ ఆఫీసర్, పాలకోడేరు
 
 సంతోషంగా ఉంది
 2008 నుంచి ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వం మమ్మల్ని ఇప్పటికిప్పుడు ఉన్న పళంగా ఉద్యోగాల నుంచి తొలగిం చాలనుకోవడం దారుణం. మా గురించి అసెంబ్లీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఉద్యోగ భద్రతకు ఆయన చేస్తున్న కృషి మరువలేనిది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లుగా ఆయుష్‌ను బలోపేతం చేసి మమ్మల్ని కొనసాగించాలి. 
 - ఎన్.ఆంజనేయులు, కాంపౌండర్, మంచిలి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement