కొండపైన కొత్త జంటలు | More than 200 Marriages at TTD on wednesday | Sakshi
Sakshi News home page

కొండపైన కొత్త జంటలు

Apr 23 2015 4:45 AM | Updated on Oct 20 2018 7:45 PM

కొండపైన కొత్త జంటలు - Sakshi

కొండపైన కొత్త జంటలు

తిరుమలలో బుధవారం కోలాహలంగా పెళ్లిళ్లు జరిగాయి. వేకువజాము నుంచి రాత్రి వరకు అధిక సంఖ్యలో వివాహ మూహూర్తాలుండడంతో నూతన జంటలు, బంధువులతో తిరుమల కళకళలాడింది.

తిరుమలలో బుధవారం కోలాహలంగా పెళ్లిళ్లు జరిగాయి. వేకువజాము నుంచి రాత్రి వరకు అధిక సంఖ్యలో వివాహ మూహూర్తాలుండడంతో నూతన జంటలు, బంధువులతో తిరుమల కళకళలాడింది. పౌరోహిత సంఘంతో పాటు టీటీడీ, మఠాల్లోని కల్యాణమండపాల్లో 200కు పైగా వివాహాలు జరిగాయి. మంగళవాయిద్యాల ధ్వునులతో కల్యాణవేదిక మారుమ్రోగింది. పౌరోహితుల మంత్రాలు, బంధువుల అల్లరి మాటలు, దంపతుల తల్లిదండ్రుల హడావుడితో కల్యాణవేదికపై సందడి నెలకొంది.

పెళ్లిళ్లు జోరుగా జరగడంతో బాజాభజంత్రీలు, పూలమాలలు, ఇతర పూజా వస్తువులు, విందు భోజనాలకు పూర్తిగా డిమాండ్ పెరిగింది.  నూతన దంపతుల కళతో ఆలయం ప్రాంగణం కొత్తగా కనిపించింది. స్వామిని దర్శించుకున్న అనంతరం నూతన వధూవరులు అఖిలాండం వద్దకు చేరుకుని  కొబ్బరికాయలను సమర్పించారు. 
-తిరుమల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement