మహబూబ్నగర్ -శ్రీశైలం మధ్య రాకపోకలకు అంతరాయం | Mahabubnagar to srisailam road way intreputed due to heavy rains | Sakshi
Sakshi News home page

మహబూబ్నగర్ -శ్రీశైలం మధ్య రాకపోకలకు అంతరాయం

Oct 24 2013 9:50 AM | Updated on Oct 8 2018 5:04 PM

భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అచ్చెంపేట మండలం సిద్ధాపూర్ సమీపంలోని పెద్దవాగు పొంగి పోర్లుతుంది.

భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అచ్చెంపేట మండలం సిద్ధాపూర్ సమీపంలోని పెద్దవాగు పొంగి పోర్లుతుంది. దాంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే చంద్రవాగులో నీటి ప్రవాహం గరిష్ట స్థాయికి చేరుకుంది. వందల ఎకరాల్లో పంట నష్టం ఏర్పడింది.

 

మహబూబ్నగర్- శ్రీశైలం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే వాహానాలను దారి మళ్లిస్తున్నారు. అలాగే నల్గొండ జిల్లాలో కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. దాంతో హుజూరునగర్ నియోజకవర్గంలో సుమారు 20 వేల ఎకరాల పత్తి పంట నీట మునిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement