రాబోయే ఎన్నికల్లో పోటీ చేయను: కిషన్ రెడ్డి | I will not contest coming elections: Kishan Reddy | Sakshi
Sakshi News home page

రాబోయే ఎన్నికల్లో పోటీ చేయను: కిషన్ రెడ్డి

Apr 4 2014 7:17 PM | Updated on Mar 29 2019 9:24 PM

రాబోయే ఎన్నికల్లో పోటీ చేయను: కిషన్ రెడ్డి - Sakshi

రాబోయే ఎన్నికల్లో పోటీ చేయను: కిషన్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ(టీడీపీ)తో ఎన్నికల పొత్తుపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని బీజేపీ నేత కిషన్‌ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ(టీడీపీ)తో ఎన్నికల పొత్తుపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని బీజేపీ నేత కిషన్‌ రెడ్డి తెలిపారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రేపు సాయంత్రంలోగా చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అని అన్నారు. ఇరుప్రాంతాల్లో 50కు పైగా అసెంబ్లీ, 9 ఎంపీ సీట్లకు పైగా స్థానాల్లో బీజేపీ పోటి చేయవచ్చని ఆయన అన్నారు.  
 
రాబోయే ఎన్నికల్లో పోటీ చేయవద్దని అనుకుంటున్నానని.. అధిష్టానం అంగీకరిస్తే పార్టీ ప్రచారం కోసం మాత్రమే పోటి చేస్తానని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేయాలి కనుక పోటీ చేయొద్దనుకుంటున్నాను ఓ ప్రశ్నకు కిషన్‌ రెడ్డి జవాబిచ్చారు.  రానున్న 2,3 రోజుల్లో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తామని కిషన్‌ రెడ్డి అన్నారు. గత కొద్దిరోజులుగా ఇరుపార్టీల నేతలు ఎన్నికల సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగిస్తున్నారు. అయితే ఇరుపార్టీలు సీట్ల సర్దుబాటుపై అవగాహనకు రాకపోవడంతో ఇంకా సందిగ్దత కొనసాగుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement