సివిల్స్ ర్యాంకర్‌పై పిల్.. కౌంటర్‌ దాఖలుకు ఆదేశం | High court orders UPPSC, AP Govt to file counter on Ronanki Gopala Krishna issue | Sakshi
Sakshi News home page

సివిల్స్ ర్యాంకర్‌పై పిల్.. కౌంటర్‌ దాఖలుకు ఆదేశం

Jun 27 2017 2:51 PM | Updated on Aug 31 2018 8:34 PM

సివిల్స్ ర్యాంకర్‌పై పిల్.. కౌంటర్‌ దాఖలుకు ఆదేశం - Sakshi

సివిల్స్ ర్యాంకర్‌పై పిల్.. కౌంటర్‌ దాఖలుకు ఆదేశం

సివిల్ ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ అంగవైకల్యాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) హైకోర్టు విచారణ చేపట్టింది.

హైదరాబాద్‌: సివిల్స్ ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ అంగవైకల్యాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) హైకోర్టు విచారణ చేపట్టింది. సికింద్రాబాద్‌ ఈస్ట్‌ మారేడ్‌పల్లికి చెందిన న్యాయవాది ఎం.మురళీకృష్ పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేయాలని యూపీపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణ మూడు వారాలు వాయిదా వేసింది.

సివిల్‌ సర్వీసెస్‌–2016  పరీక్షలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోణంకి గోపాలకృష్ణ  మూడో ర్యాంకు సాధించారు. అయితే గోపాలకృష్ణ తప్పుడు అంగవైకల్య ధ్రువీకరణ పత్రం సమర్పించి పరీక్షకు హాజరయ్యారని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. ఓబీసీ అయిన గోపాలకృష్ణ ఆర్థోపెడికల్‌ విభాగంలో 45 శాతం మేర అంగవైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం సమర్పించారని వెల్లడించారు. ఓబీసీలకు ప్రిలిమినరీ పరీక్షలో అర్హత మార్కులు 110.66 అని, అయితే గోపాలకృష్ణ 91.34 మార్కులు మాత్రమే సాధించారన్నారు. వికలాంగ కోటా కింద అర్హతకు 75.34 మార్కులని, దీంతో అతడు మెయిన్‌ పరీక్షకు అర్హత సాధించారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement