శంషాబాద్ విమానాశ్రయంలో హై అలెర్ట్ | High alert at shamshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ విమానాశ్రయంలో హై అలెర్ట్

Aug 9 2013 10:10 AM | Updated on Sep 4 2018 5:07 PM

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు శుక్రవారం హై అలెర్ట్ ప్రకటించారు.

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు శుక్రవారం హై అలెర్ట్ ప్రకటించారు. దాంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలను ముమ్మరం చేశారు. విమానాశ్రయంలో అడుగడుగునా సోదాలు చేపట్టారు. దాంతో ప్రయాణీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

 

ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. భారత స్వాతంత్ర్య దిన్సోత్సవమైన ఆగస్టు 15వ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో నగరంలోని వాహనాలు, ప్రయాణీకులను పోలీసు అధికారులు సోదాలు, తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement