
శ్రీకాకుళం :‘సార్.. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలందిస్తున్న ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులను గుర్తించాలి. మీ నాన్న గారు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మాకు ఆర్‌ఎంపీ,పీఎంపీలకు శిక్షణ ఇచ్చి ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తామన్నారు. ఆయన మరణానంతరం నిలిపివేశారు’ అని ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులు జగన్‌ను కలిసి కోరారు. తమ సమస్యలను పరిష్కరించాలని వారు ప్రతిపక్ష నేతను కోరారు.