టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై మండిపడ్డారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై మండిపడ్డారు. డీఎస్పీల బదిలీల్లోనూ అవినీతికి పాల్పడిన చరిత్ర కిరణ్‌దని హరీష్ రావు విమర్శించారు.
సీఎం సోదరుడు సంతోష్ను సంతోషపరిస్తేనే పనులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద పైసా కూడా నిధులు విడుదల కాలేదని హరీష్ రావు పేర్కొన్నారు. పైసలు వచ్చే ఫైళ్లను మాత్రమే సీఎం క్లియర్ చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం, మంత్రులు కేబినెట్ సమావేశంలో సీఎంను నిలదీయాలని హరీష్‌రావు అన్నారు.