'సీఎం కిరణ్ ను రచ్చబండకు ఆహ్వానించకండి' | harish rao fires on kiran kumar reddy | Sakshi
Sakshi News home page

'సీఎం కిరణ్ ను రచ్చబండకు ఆహ్వానించకండి'

Nov 10 2013 6:20 PM | Updated on Jul 29 2019 5:31 PM

సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ మంత్రులు ఆహ్వానించవద్దని టీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలిపారు.

కరీంనగర్: సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ మంత్రులు ఆహ్వానించవద్దని టీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా వ్యవరిస్తున్న కిరణ్ కు తెలంగాణ ప్రాంతంలో తిరిగే అర్హత కోల్పోయడని ఆయన స్పష్టం చేశారు.  తెలంగాణలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమం సందర్భంగా హరీష్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో తిరిగే అర్హతను కిరణ్  ఎప్పడో కోల్పోయడని ఆయన ఎద్దేవా చేశారు.

 

రచ్చబండ కార్యక్రమానికి కిరణ్ ను ఆహ్వానించకుండా ఉండాలని టీ.కాంగ్రెస్ మంత్రులకు సూచించారు. ఒకవేళ కిరణ్ తెలంగాణలో పర్యటిస్తే టీ.కాంగ్రెస్ నేతలు ద్రోహులుగా మిగిలిపోవడం ఖాయమని హరీష్ రావు తెలిపారు. విభజనపై వ్యతిరేకంగా ఉన్న కిరణ్ పై తెలంగాణ మంత్రులు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement