వైద్యం.. తూతూమంత్రం

emergency Medical camp in proddatur

ప్రచారం చేయకుండానే వైద్యశిబిరం

మరో పది రోజులు గడువున్న మందులు, టానిక్‌లు  

ప్రొద్దుటూరు టౌన్‌ :   మండలంలోని అమృతానగర్‌లో ఎలాంటి సమాచారం లేకుండా వైద్యశిబిరం నిర్వహించడం పట్ల స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.  ఎవరికీ చెప్పకుండా వైద్యశిబిరం పెడితే ఎవరు వస్తారని స్థానికులు డాక్టర్‌ను ప్రశ్నించారు. నాకు తెలియదు ఇక్కడికి వెళ్లమని ఫోన్‌ వస్తే వచ్చా అని డాక్టర్‌ చెప్పడంతో ప్రజలు అవాక్కయ్యారు. అక్కడ ఉన్న మందుల్లో ఆప్లాస్పిన్‌ ఎరల్‌– ఐపి టానిక్‌ (యాంటిబయాటిక్‌) మందు 2015 నవంబర్‌లో తయారు చేయగా 2017 అక్టోబర్‌తో కాలం ముగియనుంది. అంటే మరో 12 రోజుల గడువు ఉంది. అలాగే క్లోరోక్లిన్‌ టాబ్లెట్‌ 2015లో తయారుచేయగా 2017 నవంబర్‌ నెలతో కాలం ముగియనుంది. ఇలా మరి కొన్ని మందులు కూడా తక్కువ కాలం గడువు కలిగినవి వైద్య శిబిరానికి తీసుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే ప్రజల ఆరోగ్యంపై వైద్యాధికారులకు ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోంది.

కల్లూరు పీహెచ్‌సీ నుంచి తీసుకొచ్చిన మందులు
ఔట్‌ సోర్సింగ్‌ కింద పని చేస్తున్న ఏఎన్‌ఎంలు మరియమ్మ, యశోదలు మండల పరిధిలో ఉన్న కల్లూరు పీహెచ్‌సీ నుంచి మందులను తీసుకొచ్చారు. డిప్యుటేషన్‌పై కల్లూరు పీహెచ్‌సీలో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఏఎన్‌ఎం మరియమ్మను ఇక్కడ నియమించారు. ప్రతి రోజు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్లూరు నుంచి అమృతానగర్‌కు రావాలంటే కష్టంగానే ఉందని వాపోతోంది. ప్రభుత్వం ఇచ్చే జీతం డబ్బులోనే చార్జీలు పెట్టుకోవాల్సి వస్తోందని అంటోంది. ఏ వసతులు లేక పోయినా ఆరోగ్య ఉపకేంద్రంలో పని చేయాల్సిన పరిస్థితి సిబ్బందికి ఏర్పడింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top