
సాక్షి, అమరావతి: భూగర్భ జలాలు పెంచడం ద్వారా వ్యవసాయ విద్యుత్ వినియోగంలో మిగులు సాధించామని సీఎం చంద్రబాబు చెప్పారు. కాలువలు, చెరువులు పటిష్టపర్చడంతోపాటు చెక్‌డ్యాంల మరమ్మతు లను త్వరగా పూర్తిచేయా లని ఆదేశించారు. ఈ పనులు పూర్తయిన వెంటనే జూన్‌లో సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. సచివాలయంలోని తన కార్యాలయంలో సోమవారం జల వనరుల శాఖపై ఆయన సమీక్ష చేశారు.
ఇటలీ కంపెనీతో చర్చలు
రాజధాని నిర్మాణ పనులపై ఇటలీ అనస్ ఇంటర్నేషనల్ ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. దోహా, లిబియా, ఖతర్, రష్యాలో పలు ప్రాజెక్టులు చేపట్టామని.. అమరావతి లో నిర్మించే రోడ్డు ప్రాజెక్టుల్లో భాగస్వామ్యు లవుతామని, ఐకానిక్ వారధి నిర్మాణానికి అవకాశమివ్వాలని కోరారు.