అత్తాపూర్ బ్రిడ్జి కింద యువకుడి మృతదేహం | dead body found under attapur bridge | Sakshi
Sakshi News home page

అత్తాపూర్ బ్రిడ్జి కింద యువకుడి మృతదేహం

May 8 2015 3:38 PM | Updated on Sep 4 2018 5:16 PM

హైదరాబాద్ లంగర్‌హౌజ్ పరిధిలోని అత్తాపూర్ బ్రిడ్జి కింద శుక్రవారం ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది.

హైదరాబాద్ :  హైదరాబాద్ లంగర్‌హౌజ్ పరిధిలోని అత్తాపూర్ బ్రిడ్జి కింద శుక్రవారం ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా పోలీసుల విచారణలో.. మృతుడు అల్లూరి సీతారామరాజు బస్తీకి చెందిన రంగస్వామి(22)గా గుర్తించారు. రంగస్వామి స్థానికంగా ఓ హోటల్‌లో పనిచేస్తుంటాడని తెలిసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత నాలుగు రోజుల్లో ఇదే ప్రాంతంలో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement