విజయవాడ కాల్‌మనీ సెక్స్‌రాకెట్ కేసుని నీరుగార్చేందుకు ప్రభుత్వం చూస్తోందని ఏపీ రైతు సంఘం (సీపీఐ) రాష్ట్ర అధ్యక్షులు ఆవుల శేఖర్ విమర్శించారు.
అనంతపురం: విజయవాడ కాల్‌మనీ సెక్స్‌రాకెట్ కేసుని నీరుగార్చేందుకు ప్రభుత్వం చూస్తోందని ఏపీ రైతు సంఘం (సీపీఐ) రాష్ట్ర అధ్యక్షులు ఆవుల శేఖర్ విమర్శించారు. బుధవారం అనంతపురం సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, నిందితులన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని... ఈ కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం ఎత్తుగడ వేసిందని శేఖర్ అన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులు చేయించడం అన్ని పార్టీల వారూ వడ్డీ వ్యాపారంలో ఉన్నారంటూ చంద్రబాబు ప్రకటించారన్నారు. నిజంగా చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే తక్షణం తన పార్టీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తక్షణం పార్టీ నుంచి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.